Monday, April 22, 2024

వెబ్సైటు లాంచింగ్ , సైట్ రెజిస్ట్రేషన్

                            స్టేట్ కార్పెంటర్స్ వర్కర్స్ యూనియన్ కుటుంబ సబ్యులకు శుభోదయం ....   రాష్ట్ర కార్పెంటర్స్ చరిత్రలో సువర్ణ అక్షరాలతో  లిఖించదగ్గరోజు.....  19/04/24 వ తేదీ రాష్ట్ర కార్పెంటర్స్  వర్కర్స్ యూనియన్  వెబ్సైటు విజయవాడ  కనకదుర్గ అమ్మవారి సన్నిధిలో లాంచింగ్ చేయడం జరిగినది  మరియు   రాష్ట్ర కార్పెంటర్స్ యూనియన్ ఆఫీస్ కొరకు గన్నవరం ఎయిర్పోర్ట్ సమీపంలో స్థలం చూడటం , అగ్రిమెంట్ చేసుకోవడం అందరికి తెలిసిన విషయమే. రాష్ట్రవ్యాప్త కార్పెంటర్స్ భాగస్వామ్యంతో స్థలం కొనడంజరిగినది. రాష్ట్ర కార్యవర్గసభ్యుల సమక్షంలో , అందరి సహకారంతో స్ధలం గన్నవరం సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ నందు యూనియన్ కి రిజిస్ట్రేషన్ చేయించడం జరిగింది.  రాష్ట్ర అధ్యాక్షులు శ్రీ నాగేశ్వర్ రెడ్డి గారు ,ప్రధాన కార్యదర్శి శ్రీ పఠాన్ నాయబ్ రసూల్ గారు ,కోశాధికారి శ్రీ మోహన్ రావు గారు , రాష్ట్రఉపాధ్యక్షులు శ్రీ పట్నం  అంబికాపతి గారు ,శ్రీ  లక్కోజు సింహాచలం గారు , రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీ సురేంద్ర బాబు గారు, రాయలసీమ కన్వినర్ శ్రీ నాగరాజు గారు ,పెద్దలు శ్రీ అబ్దుల్ సలంగారు , అన్నమయ్య జిల్లా కన్వినర్ శ్రీ రెడ్డి బాబు గారు ,   అన్నమయ్య జిల్లా రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్రీ శంకర ఆచారి గారు , జిల్లా రాష్ట్ర సంయుక్త కార్యదర్శి శ్రీ రహమతుల్లా గారు , జంగారెడ్డి గూడెం చిన్ని గారు , బల్లంకి చిట్టిబాబు గారు , వెబ్సైటు రాజు గారు , జావీద్ గారు , జంగారెడ్డి గూడెం రాంబాబు గారు ,  తిరుపతి జిల్లా రాష్ట్ర ఉపాధ్యక్షుడు కుప్పచారి గారు , అన్నమయ్య జిల్లా   సురేష్ గారు మరియు గన్నవరం లోకల్ సంఘ నాయకులూ పాల్గొనడం జరిగినది 

ఇట్లు 

మీ సురేంద్ర బాబు, రాష్ట్ర అధికార  ప్రతినిధి 

ఆఫీస్ స్థలం వద్ద 



శ్రీ కానకదుర్గ అమ్మవారి సన్నిధిలో వెబ్సైట్ లాంచింగ్ 







                

Thursday, March 28, 2024

కార్పెంటర్స్ డే

మార్చ్ 27 తేదీని కార్పెంటర్స్ డే గ ప్రకటించుకొని రాష్ట్రవ్యాప్తంగా ఆరోజు ప్రభుత్వ ఆఫీసులయందు( హాస్పిటల్స్ , mro  mdo  ,పోలీస్ స్టేషన్ , పాఠశాలలలో ) ఉన్న రిపేర్ పనులను ఉచితంగా చేయడం ఆనవాయితీ . తిరుపతి కార్పెంటర్స్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన సమాజసేవలో భాగంగా వృద్ధులకు , దివ్యంగులకు ఆహారం అందించడం జరిగినది. ముఖ్యఅతిధిగా స్టేట్ కార్పెంటర్స్ వర్కర్స్  యూనియన్ రాష్ట్ర అధికార ప్రతినిధి సురేంద్ర బాబు గారు హాజరు అయ్యి తిరుపతి కార్పెంటర్స్ సంక్షేమ సంఘ సభ్యులను అభినందించడం జరిగినది. తీరుపతి సంఘ ప్రధాన కార్యదర్శి శ్రీ వెలుగరం కుప్పచారి , గౌరవ సలహాదారుడు శ్రీ నోటకర్ల మురళి ఆచారి , రాజశేఖర్ ఆచారి , మురళీధర్ , మోహన్ ఆచారి తదితరులు పాల్గొనడం జరిగినది. 






 

Thursday, March 14, 2024

మర్యాదపూర్వక కలయిక

రాష్ట్ర కార్పెంటర్ వర్క్ యూనియన్ సోదరులకు ముందుగా నమస్కారాలు ఈరోజు మన రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ 




పప్పుసాని నాగేశ్వర్ రెడ్డి అన్నగారు ,వాళ్ళ తల్లిగారు మరియు కుటుంబ సభ్యులు అందరూ తిరుమల  దైవదర్శనం చేసుకొని అక్కడినుంచి  కాణిపాకం రావడం జరిగింది
 మన రాష్ట్ర కార్పెంటర్ వర్కర్ యూనియన్ సభ్యులు
 రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్రీ పట్నం అంబికాపతి గారు ,రాష్ట్ర సంయుక్త  కార్యదర్శి చిత్తూరు  శ్రీ  చంద్రశేఖర్ గారు , రాష్ట్ర ఆర్గనైజర్ ప్రెసిడెంట్ శ్రీ గుడిపాల  మోహనా చారి గారు . రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీ సురేంద్ర బాబు గారు,
    మరియు చిత్తూరు జిల్లా కన్వీనర్ శ్రీ  కుమరేష్ గారు 
   రాష్ట్ర గౌరవ సలహాదారులు శ్రీ  శంకరాచార్య గారు 
తవణం పల్లె   ప్రెసిడెంట్ నవీన్  గారు 
  పీలేరు ఆత్మ మిత్రుడు బాబ్జి గారు వెళ్లి  కలవడం జరిగింది

   

Wednesday, March 6, 2024

ఉద్యమ సర్టిఫికెట్ రిజిస్ట్రేషన్ (పాకాల)

                  పాకాల మండల కార్పెంటర్స్ కి ,టైలర్స్ కి పీఎం ఉద్యోగ కల్పనా పథకం (PMEGP) కింద ఉద్యమ సర్టిఫికెట్ రిజిస్ట్రేషన్ కార్యక్రమం సురేంద్ర బాబు షాప్ వద్ద DIC (district industries centre ) వారిచే నిర్వహించబడినది. ఈరోజు సాయంత్రం వరకు  9 సర్టిఫికెట్స్ చేయడం , 3 షాప్స్ ఫోటోలు ఆన్లైన్ చేయడం జరిగినది. కార్పెంటర్స్ , టైలర్స్ విచ్చేసి పాల్గొనడం జరిగినది . 


  

పీలేరు కార్పెంటర్స్ కాలనీ

                 పీలేరు కార్పెంటర్స్ కాలనీ కి గౌరవనీయులు శాసనసభ్యులు  ఎంపీ గార్లు మాట ఇచ్చినట్లే కాలనీ బోర్  మంజూరు చేయడం జరిగినది. 5/02/24 తేదీ బోర్  వాహనం రావడం జరిగింది. పీలేరు మండల కార్పెంటర్స్ అధ్యక్షులు శ్రీ రెడ్డి బాబు గారు , థి స్టేట్ కార్పెంటర్స్ వర్కర్స్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్రీ పట్నం అంబికాపతి గారు , కోశాధికారి శంకర  ఆచారి గారు పూజ కార్యక్రమం చేసి బోర్ వేయడం ప్రారంభించారు.  60 అడుగుల లోతునుంచే 1" నీళ్లు ప్రారంభం అయ్యి సుమారు 700 అడుగుల లోతువరకు 2" నీళ్లు పుష్కలంగా ఉబికిరావడం మన కార్పెంటర్స్ హర్షతిరేకాలతో ,ఆనందంతో పొంగిపోయారు. 06/03/24 సాయంత్రం వరకు నిరంతరాయం గ బోర్ వేయడం జరిగినది. మంచిమనసుతో చేసేపనులు సఫలం అవుతాయి అన్న నానుడి మరోసారి నిరూపణ అయ్యింది 



 

Monday, March 4, 2024

చిత్తూర్ కార్పెంటర్స్ ఎస్టేట్ ప్రారంభోత్సవం

                           ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ , ఎక్కడ జరగని విధంగా కార్పెంటర్స్ జీవితాలలో వెలుగులు నింపి , అభివృద్ధికి తోడ్పాటు ఇవ్వడానికి చిత్తూర్ కార్పెంటర్స్ కమిటీ ఆధ్వర్యంలో ,శ్రీ బుల్లెట్  సురేష్ గారి సహకారంతో , ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ  పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారి చొరవతో 90 మందికి ఒకే స్థలంలో కార్పెంటర్స్ ఎస్టేట్  కి స్థలం కేటాయించడం అన్నది అద్భుతం. ఆ అద్భుతాన్ని సాధించడంలో ది స్టేట్ కార్పెంటర్స్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర  సంయుక్త కార్యదర్శి శ్రీ చంద్ర శేఖర్ గారు , రాష్ట్ర ఆర్గనైసింగ్ ప్రెసిడెంట్ శ్రీ మోహన్ ఆచారి గారు , చిత్తూర్ కమిటీ ప్రధాన కార్యదర్శి శ్రీ కుమరేష్ గారు పడిన కష్టం మాటలకు అందనిది. కొండలు , బండలు పిండిచేసి చదును కార్యక్రమం ఓ యజ్ఞం ల చేసిన చిత్తూర్ కార్పెంటర్స్ కష్టం నేను ప్రత్యక్షంగా చూడటం జరిగినది. 

                            ఈరోజు 04/03/2024 సోమవారం రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారు స్వహస్తాలతో , బులెట్ సురేష్ గారు , చిత్తూర్ జిల్లా కలెక్టర్ గారు సంయుక్తంగా చిత్తూర్ కార్పెంటర్స్ ఎస్టేట్ ప్రారంభోత్సవం  కార్యక్రమం శ్రీ చంద్ర శేఖర్ గారు , శ్రీ మోహన్ ఆచారి గారు , కుమరేష్ గార్ల అధ్యక్షతన  వైభవంగా జరిగింది. చుట్టుపక్కల జిల్లాలు అన్నమయ్య జిల్లా నుంచి ది స్టేట్ కార్పెంటర్స్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు  శ్రీ అంబికాపతి గారి ఆధ్వర్యంలో , తిరుపతి జిల్లా రాష్ట్ర అధికార ప్రతినిధి  శ్రీ సురేంద్రబాబు గారి ఆధ్వర్యంలో కార్పెంటర్స్ విచ్చేయడం జరిగింది. చిత్తూర్ కార్పెంటర్స్ కుటుంబ సభ్యులు పెద్దఎత్తున హాజరు అయ్యి ఓ పండుగల కార్యక్రమాం జరిగింది 











Thursday, February 29, 2024

పీలేరు కార్పెంటర్స్ కాలనీ ప్రారంభోత్సవం

                         ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రము లో మొట్టమొదటగా ఒక వృత్తిదారులకు ఒకేచోట సుమారు 300 ఇంటి స్థలాలు ఇవ్వడం అన్నది ఒక్క పీలేరు మండలంలో సాధ్యం అయింది.  కలసివుంటే ఎంతటి అసాధ్యం అయిన పని కూడా సాధ్యం అవుతుంది అని పీలేరు మండల కార్పెంటర్ సోదరులు నిరూపించుకున్నారు. శ్రీ పట్నం అంబికాపతి ఆచారి గారి సారధ్యంలో మండల కార్పెంటర్స్ అధ్యక్షులు శ్రీ రెడ్డి బాబు గారు , కోశాధికారి శ్రీ శంకరాచారి గారు కమిటీ సభ్యులు కృషి ఫలితం ఈ కార్పెంటర్స్ కాలనీ. పనులు ,నిద్ర మానుకొని ఎన్నోసార్లు అధికారుల చుట్టూ , రాజకీయ నాయకుల చుట్టూ తిరిగి , ఎగతాళిగా నవ్వుకున్నా వారిముందు సగర్వంగా నిలుచున్నా కృషివరులు.  కొండలు పిండిచేసి కార్పెంటర్స్ కి అభివృద్ధి చేసిన లేఔట్ ల ఇవ్వడం అన్నది, అతి తక్కువ సమయంలో పగలు రాత్రి అన్నది చూడకుండా వంతులవారీగా ఉంటూ పనులు చేయిస్తూ నాటి  స్వప్నాన్ని సజీవరూపంలో  చూపించడం అన్నది కేవలం పీలేరు మండల కార్పెంటర్స్ సోదరులకు మాత్రమే సాధ్యం. 

                         ఈరోజు  ఎంపీ శ్రీ మిథున్  రెడ్డి గారు , శాసన సభ్యులు శ్రీ చింతల రామచంద్ర రెడ్డి గార్ల చేతుల మీదుగా పీలేరు కార్పెంటర్స్ కాలనీ ప్రారంభోత్సం కార్యక్రమం జరిగినది. ఎంపీ గారి చేతుల మీదుగా శిలాఫలకం ఆవిష్కరించడం జరిగినది. ఈ కార్యక్రమానికి పెద్దఎత్తున కార్పెంటర్స్ ,వారి కుటుంబ సభ్యులు హాజరుఅయ్యి కార్యక్రమాన్ని విజయవంతం చేయడం పీలేరు కార్పెంటర్స్ ఐక్యతకు నిదర్శనం ...... 

 







    

Sunday, February 25, 2024

ఎంపీ గారికి సత్కారం

               పీలేరు మండల కార్పెంటర్స్ కాలనీ స్థలం రావడానికి ప్రధాన కారకులు అయినా ఎంపీ శ్రీ మిదున్ రెడ్డి కి రాష్ట్ర యూనియన్ అధ్యక్షులు శ్రీ నాగేశ్వర్ రెడ్డి గారు , పీలేరు మండల అధ్యక్షులు శ్రీ రెడ్డిబాబు గారు , ప్రధాన కార్యదర్శి శ్రీ అంబికాపతి గారు , కోశాధికారి శ్రీ శంకరాచారి  గారు  పీలేరు మండల కార్పెంటర్స్ అందరూ మర్యాదపూర్వకంగా  కలిసి ఓ చిన్న సన్మానం చేయడం జరిగినది.  




ఆఫీస్ స్థలం అగ్రిమెంట్

       ది స్టేట్ కార్పెంటర్స్ వర్కర్స్ యూనియన్ కుటుంబ సబ్యులకు నమస్కారములు .... మన కార్పెంటర్స్ యూనియన్ ఆఫీస్ కి  స్థలం చుసిన విషయం,  గన్నవరం ఎయిర్పోర్ట్ వద్ద 200 గజాలు స్థలం కొరకు అడ్వాన్స్ గ 50,000 రూ  ఇచ్చిన విషయం తెలిసిందే .. ఈరోజు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ పఠాన్ నాయబ్ రసూల్ గారు , కోశాధికారి శ్రీ మోహన్ రావు , ఉపాధ్యక్షుడు శ్రీ లక్కోజు సింహాచలం గారు , పెద్దలు శ్రీ అబ్దుల్ సలాం గార్ల సమక్షంలో స్థలం  సేల్అగ్రిమెంట్ కోసం 2,85,000 రూ ఇచ్చి మొత్తం 3,35,000 రూ  లకు అగ్రిమెంట్  చేసుకోవడంజరిగినది. రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ప్రకటించిన మొత్తం లో 30% వసూలు  చేసి ఇవ్వడం జరిగినది 

      అలాగే రాష్ట్ర పెద్దలు శ్రీ అబ్దుల్ సలాం గారు హజ్ యాత్రకు వెళ్తున్న సందర్భంగా వారికీ యూనియన్ తరపున శుభాకాంక్షలు తెలియచేసి చిరు సన్మానం  చేయడం జరిగినది.. స్థలం కోసం తమ కష్టార్జితాన్ని యూనియన్ ఆఫీస్ కోసం ఇచ్చిన ప్రతిఒక్కరికి ధన్యవాదాలు 






 









Tuesday, February 20, 2024

స్థలం దాతలు---విరాళాలు

 ది స్టేట్ కార్పెంటర్ వర్కర్స్ యూనియన్ ఆంధ్ర ప్రదేశ్

ముందుగా అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ మన
యూనియన్ ఆఫీస్ స్థలం కొనుటకు విరాళాలుగా ఇచ్చినటువంటి దాతలు యొక్క పేర్లు
 పి నాగేశ్వర్ రెడ్డి గారు( అనంతపురం)                    2,50,000
                                     
  అబ్దుల్ సలాం గారు (విజయవాడ)                          1,00116
                 
 పటాన్ నాయబ్ రసూల్ గారు (గుంటూరు.)            1,00116
                                        
 పి అంబికా పతి ఆచారి గారు (పీలేరు.)                    1,00116
                                         
 ఏలూరి శంకరాచారి గారు (పీలేరు)                           1,00116

పీలేరు మండల కమిటీ                                                1,05000
                                        
 ఏ నాగరాజు గారు (అనంతపురం)                              50,116
                                        
 ఫరూక్ గారు  ( గోరంట్ల.)                                                 50,116
 చంద్ర శేఖర్  గారు (చిత్తూరు)                                       50,116
 మోహనాచారి గారు (చిత్తూర్)                                       50,116
 మధు (గంగ అల్యూమినియం ) అనంతపురం        30,000
 
 టీ మోహన్ రావు  (తాడేపల్లిగూడెం)                             25,116
                                          
 దామోదర్ గారు  (చిత్తూరు)                                           10,116
 మనోజ్  గారు (సత్యసాయి .)                                       10,116
 సురేంద్ర బాబు  గారు (పాకాల)                                    10,116
 జి సూర్యనారాయణ గారు (గుంటూరు)                      10,116
.                                                                                 
 నబి రసూల్  గారు (తాడిపత్రి)                                     10,116
 గోవర్ధన్  గారు (అనంతపురం)                                      10,116
బాబ్జి  (వెల్డింగ్ షాప్ ,పీలేరు )                                         10,000   
M  రమేష్ ఆచారి (సోమల మండలం)                         10,116
బి  శివ (ధామాలచెరువు ,పాకాల )                                    5000
S తన్వీర్  (వెల్డింగ్ ,పీలేరు )                                             5000
వీ నవీన్ కుమార్  (పీలేరు)                                                1000
M భాష  (పీలేరు)                                                                 1000
B హరి ప్రసాద్ (పీలేరు)                                                      1000
M వంశి       (పీలేరు)                                                              500
M వెంకట రమణ (పీలేరు)                                                   500
M మల్లయ్య (పీలేరు)                                                            500
K  రమణ ఆచారి  (పీలేరు)                                                   500 

ఇప్పటి వరకు ప్రకటించింది మరియు వసూలు  అయినా మొత్తం    

Sunday, February 18, 2024

రాష్ట్ర కార్యవర్గం

 

రాష్ట్ర అధ్యక్షులు 

పప్పుసాని నాగేశ్వర్ రెడ్డి 

9866141378    అనంతపురం 



రాష్ట్ర ప్రధాన కార్యదర్శి 
పఠాన్ నాయబ్ రసూల్ 
9703454999    గుంటూరు 















రాష్ట్ర కోశాధికారి 
తామరపల్లె మోహన్ రావు 
9505911799     తాడేపల్లె గూడెం 





















రాష్ట్ర ఉపాధ్యక్షులు 
పట్నం అంబికాపతి 
9885690558      అన్నమయ్య  

























రాష్ట్ర ఉపాధ్యక్షులు 
లక్కోజు సింహాచలం (శివ)
9392121798       విజయవాడ 



















రాష్ట్ర సంయుక్త కార్యదర్శి 
పాపుదేశి చంద్రశేఖర్ 
9985078271          చిత్తూర్ 





















రాష్ట్ర అధికార ప్రతినిధి 
కొడకంటి సురేంద్ర బాబు 
8686455086      తిరుపతి 



















రాష్ట్ర ఆర్గనైజింగ్ ప్రెసిడెంట్ 
G మోహన్ ఆచారి 
9491520914        చిత్తూర్ 





















రాష్ట్ర గౌరవ అధ్యక్షులు 
బీజాపూర్ నబి రసూల్ 
9553684629          అనంతపురం 




















రాష్ట్ర గౌరవ అధ్యక్షులు 
ఎన్నికపాటి రామచంద్ర ఆచారి 
6301274797          తిరుపతి 





















రాయలసీమ కన్వినర్ 
A  నాగరాజు 
9441665322         అనంతపురం