Friday, October 20, 2023

అందించిన సాయం

    తాడిపత్రి కార్పెంటర్ అసోసియేషన్ సభ్యులు  ఒక కార్పెంటర్ సోదరునికి  ఈ సంఘం  ఏర్పడిన కొన్ని గంటలకే  మూల ఆచారి అనే  ఒక
విశ్వబ్రాహ్మణ  పెద్దాయనకు  ఆయనకు ఆరోగ్యం బాగా లేకపోతే  వెంటనే
మా తాడిపత్రి కార్పెంటర్ సోదరులు 
ఆయనకు  20000 రూపాయలు అందించడం జరిగినది  ఇట్లు తాడిపత్రి కార్పెంటర్ అసోసియేషన్  రాష్ట్ర గౌరవ అధ్యక్షులు 
 బి నబి రసూల్  తాడిపత్రి అధ్యక్షులు  శివకుమార్ ఆచారి గారు  జాయింట్ సెక్రెటరీ  గోపాల చారి గారు  మున్నా గారు నాగేష్ ఆచారి గారు  ఈ డబ్బులు
హాస్పిటల్ దగ్గరికి పోయి వారికి అందించడం జరిగింది  ఇట్లు తాడిపత్రి కార్పెంటర్ అసోసియేషన్

ఆవిర్భావ సభ

livelive   అనంతపురం నివాసి శ్రీ పప్పుసాని నాగేశ్వర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో 18.10.2023 బుధవారం అంబటి గంటారెడ్డి ఫంక్షన్ హాల్ వేదికగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్పెంటర్స్(వడ్రంగి) యూనియన్ అను సంఘం ,విచ్చేసిన రాష్ట్రవ్యాప్త కార్పెంటర్ వృత్తిదారుల భాగస్వామ్యంతో ఆవిర్భావం జరిగినది. కులమత ప్రస్థావనలేని ఒకటే కులం ఒకటే మతo అది కార్పెంటర్ కులం , కార్పెంటర్ మతం ప్రాతిపదికన ప్రారంభించబడినది. యూనియన్ రథ సారధులు:- శ్రీ నాగేశ్వర్ రెడ్డిగారు(అనంతపురం) అధ్యక్షుడు గా , శ్రీ పఠాన్ నాయబ్ రసూల్ గారు(గుంటూరు) ప్రధాన కార్యదర్శి గా, శ్రీ తామర పల్లె మోహనరావు గారు(ప.గోదావరి) కోశాధికారిగా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగినది.  రాష్ట్ర  కార్యవర్గం వివరాలు...
గౌరవ అధ్యక్షులు 
శ్రీ నబి రసూల్ గారు
శ్రీ రామచంద్ర ఆచారి గారు
రాష్ట్ర ఉపాధ్యక్షులు
శ్రీ పట్నం అంబికపతి గారు
శ్రీ లక్కొజు సింహాచలం గారు
రాష్ట్ర సంయుక్త కార్యదర్శి
శ్రీ పప్పుదేసి చంద్రశేఖర్ గారు
రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు : శ్రీ మోహన్ ఆచారి గారు
రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి : శ్రీ గోరంట్ల ఫరూక్ గారు
రాష్ట్ర అధికార ప్రతినిధి: శ్రీ కొడకంటి సురేంద్రబాబు గారు
రాయలసీమ కన్వీనర్ : శ్రీ నాగరాజు గారు  నియమించుకోవడం జరిగినది.

ముందుమాట...

సృష్టి ఆరంభంనుంచి చేతివృత్తుల వారే మొదటితరం ఇంజినీర్లుగా ప్రసిద్ధిచెందారు , సమాజ నాగరికత కు ,అభివృద్ధికి చేతివృత్తులే ఆధారం పనిలో ఖచ్చితత్వం , నైపుణ్యం వల్ల ఆదరణ , గౌరవం సమాజంలో ఉండేవి. కాలక్రమేణా చేతివృత్తులలోకి కార్పొరేట్ సంస్థల ఆగమనం వల్ల చాలా వృత్తులు కనుమరుగు అయిపోయాయి. నేటిసమాజంలో వేగవంతమే ప్రామాణికం అవుతున్న వేళలో కాస్తో కూస్తో ఆదరణ ఉన్న వృత్తులలో కార్పెంటర్(వగ్రంగి,కలప పని)ఒకటి. అంతేకాకుండా పురాతన వృత్తులలో ఒకటి , ఇంటి తలుపులు, కిటికీలు, డైనింగ్‌ టేబుల్లు, మంచాలు, వడ్రంగులు చేస్తారు. ప్రస్తుతం వడ్రంగితో పనిచేయించుకుంటే ఆలస్యం అవుతుందని భావించి రెడీమెడ్‌ తలుపులు, డైనింగ్‌ టేబుళ్ళను కొనుగోలు చేయడంతో ఈ రకం చేతి వృత్తులు అంతరించి పోతున్నాయి. అనేక జిల్లాలలో  వేలాది ముస్లింలు , ఇతర మతస్థులు కూడా  వడ్రంగిపని చేస్తున్నారు. నెల పొడవునా పనిచేసినా కనీసం వెయ్యిరూపాయలు కూడా రాదని వడ్రంగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు . కులవృత్తినే నమ్ముకుని వేలాది మంది తమ గ్రామాలు వదిలి పట్టణాలకు వలస వచ్చారు. చేసే పనికి కూలీ గిట్టుబాటు కాక నేడు వారు నౌకర్లుగా, గుమస్తాలుగా వేరే పనుల్లో పడుతున్నారు. అతి సాధారణ పనిముట్లతో ఎంతో అద్భుత సృష్టి చేసిన వడ్రంగి వృత్తివారు వాడే సాధారణ పనిముట్లు 
  1. చిత్రిక 
  2. సుత్తి
  3. ఉలి 
  4. బాడిత
  5. రంపం
ఒకపక్క కార్పొరేట్ సంస్థల పోటీని , ప్రభుత్వాలనుంచి  ఆదరణ లేకున్నా మనమందరం సమిష్టి కృషితో  కనుమరుగు కాకుండా కాపాడుకుంటూ వస్తున్నాము. కానీ మన తర్వాతి తరం ఈ వృత్తిలో కొనసాగడానికి ఎవ్వరు ముందుకు రావడంలేదు  అందుకే ప్రభుత్వాలు మనవృత్తిని గుర్తించి ప్రోత్సహించేలా పోరాటాలు చేయాల్సిన అగత్యం వస్తుంది అందుకు బలమైన వేదిక ఒకటి అవసరం. అందుకు రాష్ట్రవ్యాప్త వేదిక , ఐక్యమత్యం ఎంతైనా అవసరం అలాంటి వేదిక బలమైన సంఘం , సమర్ధనాయకత్వo ద్వారానే సాధ్యం.అందుకే ది స్టేట్ కార్పెంటర్స్ వర్కర్స్ యూనియన్  ర్తాష్ట్రవ్యాప్త కార్పెంటర్స్ భాగస్వామ్యంతో అనంతపురం వేదికగా   ఒకటి స్థాపించబడినది.