Thursday, February 29, 2024

పీలేరు కార్పెంటర్స్ కాలనీ ప్రారంభోత్సవం

                         ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రము లో మొట్టమొదటగా ఒక వృత్తిదారులకు ఒకేచోట సుమారు 300 ఇంటి స్థలాలు ఇవ్వడం అన్నది ఒక్క పీలేరు మండలంలో సాధ్యం అయింది.  కలసివుంటే ఎంతటి అసాధ్యం అయిన పని కూడా సాధ్యం అవుతుంది అని పీలేరు మండల కార్పెంటర్ సోదరులు నిరూపించుకున్నారు. శ్రీ పట్నం అంబికాపతి ఆచారి గారి సారధ్యంలో మండల కార్పెంటర్స్ అధ్యక్షులు శ్రీ రెడ్డి బాబు గారు , కోశాధికారి శ్రీ శంకరాచారి గారు కమిటీ సభ్యులు కృషి ఫలితం ఈ కార్పెంటర్స్ కాలనీ. పనులు ,నిద్ర మానుకొని ఎన్నోసార్లు అధికారుల చుట్టూ , రాజకీయ నాయకుల చుట్టూ తిరిగి , ఎగతాళిగా నవ్వుకున్నా వారిముందు సగర్వంగా నిలుచున్నా కృషివరులు.  కొండలు పిండిచేసి కార్పెంటర్స్ కి అభివృద్ధి చేసిన లేఔట్ ల ఇవ్వడం అన్నది, అతి తక్కువ సమయంలో పగలు రాత్రి అన్నది చూడకుండా వంతులవారీగా ఉంటూ పనులు చేయిస్తూ నాటి  స్వప్నాన్ని సజీవరూపంలో  చూపించడం అన్నది కేవలం పీలేరు మండల కార్పెంటర్స్ సోదరులకు మాత్రమే సాధ్యం. 

                         ఈరోజు  ఎంపీ శ్రీ మిథున్  రెడ్డి గారు , శాసన సభ్యులు శ్రీ చింతల రామచంద్ర రెడ్డి గార్ల చేతుల మీదుగా పీలేరు కార్పెంటర్స్ కాలనీ ప్రారంభోత్సం కార్యక్రమం జరిగినది. ఎంపీ గారి చేతుల మీదుగా శిలాఫలకం ఆవిష్కరించడం జరిగినది. ఈ కార్యక్రమానికి పెద్దఎత్తున కార్పెంటర్స్ ,వారి కుటుంబ సభ్యులు హాజరుఅయ్యి కార్యక్రమాన్ని విజయవంతం చేయడం పీలేరు కార్పెంటర్స్ ఐక్యతకు నిదర్శనం ...... 

 







    

Sunday, February 25, 2024

ఎంపీ గారికి సత్కారం

               పీలేరు మండల కార్పెంటర్స్ కాలనీ స్థలం రావడానికి ప్రధాన కారకులు అయినా ఎంపీ శ్రీ మిదున్ రెడ్డి కి రాష్ట్ర యూనియన్ అధ్యక్షులు శ్రీ నాగేశ్వర్ రెడ్డి గారు , పీలేరు మండల అధ్యక్షులు శ్రీ రెడ్డిబాబు గారు , ప్రధాన కార్యదర్శి శ్రీ అంబికాపతి గారు , కోశాధికారి శ్రీ శంకరాచారి  గారు  పీలేరు మండల కార్పెంటర్స్ అందరూ మర్యాదపూర్వకంగా  కలిసి ఓ చిన్న సన్మానం చేయడం జరిగినది.  




ఆఫీస్ స్థలం అగ్రిమెంట్

       ది స్టేట్ కార్పెంటర్స్ వర్కర్స్ యూనియన్ కుటుంబ సబ్యులకు నమస్కారములు .... మన కార్పెంటర్స్ యూనియన్ ఆఫీస్ కి  స్థలం చుసిన విషయం,  గన్నవరం ఎయిర్పోర్ట్ వద్ద 200 గజాలు స్థలం కొరకు అడ్వాన్స్ గ 50,000 రూ  ఇచ్చిన విషయం తెలిసిందే .. ఈరోజు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ పఠాన్ నాయబ్ రసూల్ గారు , కోశాధికారి శ్రీ మోహన్ రావు , ఉపాధ్యక్షుడు శ్రీ లక్కోజు సింహాచలం గారు , పెద్దలు శ్రీ అబ్దుల్ సలాం గార్ల సమక్షంలో స్థలం  సేల్అగ్రిమెంట్ కోసం 2,85,000 రూ ఇచ్చి మొత్తం 3,35,000 రూ  లకు అగ్రిమెంట్  చేసుకోవడంజరిగినది. రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ప్రకటించిన మొత్తం లో 30% వసూలు  చేసి ఇవ్వడం జరిగినది 

      అలాగే రాష్ట్ర పెద్దలు శ్రీ అబ్దుల్ సలాం గారు హజ్ యాత్రకు వెళ్తున్న సందర్భంగా వారికీ యూనియన్ తరపున శుభాకాంక్షలు తెలియచేసి చిరు సన్మానం  చేయడం జరిగినది.. స్థలం కోసం తమ కష్టార్జితాన్ని యూనియన్ ఆఫీస్ కోసం ఇచ్చిన ప్రతిఒక్కరికి ధన్యవాదాలు 






 









Tuesday, February 20, 2024

స్థలం దాతలు---విరాళాలు

 ది స్టేట్ కార్పెంటర్ వర్కర్స్ యూనియన్ ఆంధ్ర ప్రదేశ్

ముందుగా అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ మన
యూనియన్ ఆఫీస్ స్థలం కొనుటకు విరాళాలుగా ఇచ్చినటువంటి దాతలు యొక్క పేర్లు
 పి నాగేశ్వర్ రెడ్డి గారు( అనంతపురం)                    2,50,000
                                     
  అబ్దుల్ సలాం గారు (విజయవాడ)                          1,00116
                 
 పటాన్ నాయబ్ రసూల్ గారు (గుంటూరు.)            1,00116
                                        
 పి అంబికా పతి ఆచారి గారు (పీలేరు.)                    1,00116
                                         
 ఏలూరి శంకరాచారి గారు (పీలేరు)                           1,00116

పీలేరు మండల కమిటీ                                                1,05000
                                        
 ఏ నాగరాజు గారు (అనంతపురం)                              50,116
                                        
 ఫరూక్ గారు  ( గోరంట్ల.)                                                 50,116
 చంద్ర శేఖర్  గారు (చిత్తూరు)                                       50,116
 మోహనాచారి గారు (చిత్తూర్)                                       50,116
 మధు (గంగ అల్యూమినియం ) అనంతపురం        30,000
 
 టీ మోహన్ రావు  (తాడేపల్లిగూడెం)                             25,116
                                          
 దామోదర్ గారు  (చిత్తూరు)                                           10,116
 మనోజ్  గారు (సత్యసాయి .)                                       10,116
 సురేంద్ర బాబు  గారు (పాకాల)                                    10,116
 జి సూర్యనారాయణ గారు (గుంటూరు)                      10,116
.                                                                                 
 నబి రసూల్  గారు (తాడిపత్రి)                                     10,116
 గోవర్ధన్  గారు (అనంతపురం)                                      10,116
బాబ్జి  (వెల్డింగ్ షాప్ ,పీలేరు )                                         10,000   
M  రమేష్ ఆచారి (సోమల మండలం)                         10,116
బి  శివ (ధామాలచెరువు ,పాకాల )                                    5000
S తన్వీర్  (వెల్డింగ్ ,పీలేరు )                                             5000
వీ నవీన్ కుమార్  (పీలేరు)                                                1000
M భాష  (పీలేరు)                                                                 1000
B హరి ప్రసాద్ (పీలేరు)                                                      1000
M వంశి       (పీలేరు)                                                              500
M వెంకట రమణ (పీలేరు)                                                   500
M మల్లయ్య (పీలేరు)                                                            500
K  రమణ ఆచారి  (పీలేరు)                                                   500 

ఇప్పటి వరకు ప్రకటించింది మరియు వసూలు  అయినా మొత్తం    

Sunday, February 18, 2024

రాష్ట్ర కార్యవర్గం

 

రాష్ట్ర అధ్యక్షులు 

పప్పుసాని నాగేశ్వర్ రెడ్డి 

9866141378    అనంతపురం 



రాష్ట్ర ప్రధాన కార్యదర్శి 
పఠాన్ నాయబ్ రసూల్ 
9703454999    గుంటూరు 















రాష్ట్ర కోశాధికారి 
తామరపల్లె మోహన్ రావు 
9505911799     తాడేపల్లె గూడెం 





















రాష్ట్ర ఉపాధ్యక్షులు 
పట్నం అంబికాపతి 
9885690558      అన్నమయ్య  

























రాష్ట్ర ఉపాధ్యక్షులు 
లక్కోజు సింహాచలం (శివ)
9392121798       విజయవాడ 



















రాష్ట్ర సంయుక్త కార్యదర్శి 
పాపుదేశి చంద్రశేఖర్ 
9985078271          చిత్తూర్ 





















రాష్ట్ర అధికార ప్రతినిధి 
కొడకంటి సురేంద్ర బాబు 
8686455086      తిరుపతి 



















రాష్ట్ర ఆర్గనైజింగ్ ప్రెసిడెంట్ 
G మోహన్ ఆచారి 
9491520914        చిత్తూర్ 





















రాష్ట్ర గౌరవ అధ్యక్షులు 
బీజాపూర్ నబి రసూల్ 
9553684629          అనంతపురం 




















రాష్ట్ర గౌరవ అధ్యక్షులు 
ఎన్నికపాటి రామచంద్ర ఆచారి 
6301274797          తిరుపతి 





















రాయలసీమ కన్వినర్ 
A  నాగరాజు 
9441665322         అనంతపురం 






Wednesday, February 14, 2024

              ది స్టేట్ కార్పెంటర్స్ వర్కర్స్ యూనియన్ ఆఫీస్ కొరకు గన్నవరం ఎయిర్పోర్ట్ వద్ద 200 గజాల స్థలం చూడటం , అడ్వాన్సు ఇవ్వడం అందరికి తెలిసిందే . స్థలం కొనుగోలుకు రాష్ట్ర కార్యవర్గం విరాళాలు ప్రకటించిన విషయం తెలిసిందే అందులో పావువంతు అగ్రిమెంట్ కొరకు అడగటం , మొదట చిత్తూర్ జిల్లా నుంచి రాష్ట్ర సంయుక్త కార్యదర్శి శ్రీ చంద్రశేఖర్ గారు , ఆర్గనైసింగ్ ప్రెసిడెంట్ శ్రీ మోహన్ ఆచారి గారు 22/01/24  తేదీన 50,001 రూపాయలు రాష్ట్ర కోశాధికారి శ్రీ మోహన్ రావు గారికి ఫోన్ పే ద్వారా పంపడం జరిగినది 

               పీలేరు మండల కార్పెంటర్స్ కమిటీ అధ్యక్షుడు శ్రీ రెడ్డిబాబు గారి బామ్మర్ది పెళ్లి సందర్భంగా చిత్తూర్ కార్పెంటర్స్ ,వాయల్పాడు కార్పెంటర్స్ , కలకడ  కార్పెంటర్స్ ,పీలేరు కార్పెంటర్స్ అందరూ విచ్చేసి నూతన వధూవరులను ఆశీర్వదించడం జరిగినది. ది స్టేట్ కార్పెంటర్స్ ఉపాధ్యక్షుడు శ్రీ అంబికాపతి గారు , సంయుక్త కార్యదర్శి శ్రీ చంద్రశేఖర్ గారు , రాష్ట్ర అధికార ప్రతినిధి సురేంద్ర బాబు గారు ,రాష్ట్ర ఆర్గనైసింగ్ ప్రెసిడెంట్ శ్రీ మోహన్ ఆచారి గారు , కలకడ  శ్రీ రహమతుల్లా గారు విచ్చేయడం జరిగినది 










Friday, February 9, 2024

ఉద్యమ సర్టిఫికెట్ రిజిస్ట్రేషన్ (పాకాల)



పాకాల మండలంలో కార్పెంటర్స్ కి పీఎం విస్వకర్మ యోజన పథకం ,సూక్ష్మ చిన్న మద్యమా పరిశ్రమ పథకం  (PMEGP ), పీఎం  ఉపాధి కల్పనా పథకం(PMEGP )  సంబంధించి ఉద్యమ సర్టిఫికెట్ రిజిస్ట్రేషన్ ప్రోగ్రాం ఏపీ రూరల్ డెవలప్మెంట్ వెల్ఫేర్ సొసైటీ వారి ద్వారా ధామలచెరువు  నేండ్రగుంట రోడ్ ,ఇరాంగారిపల్లె వద్ద ఉన్న SNS INTERIORS  షాప్ వద్ద ది స్టేట్ కార్పెంటర్స్ వర్కర్స్ యూనియన్  రాష్ట్ర అధికార ప్రతినిధి  సురేంద్ర బాబు అధ్యక్షతన 8/02/2024 వ తేదీ     నిర్వహించడం జరిగినది . కార్పెంటర్స్ , టైలర్స్ షాప్స్ వారు  రిజిస్ట్రేషన్ చేయించుకోవడం జరిగినది. తేదీ 09/02/2024 రోజు ముందు లోన్స్ తీసుకున్న వారు , కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకున్న వారి  షాప్స్ వద్దకు వెళ్లి ఫోటోలు , సర్టిఫికెట్స్ అప్డేట్ చేయడం జరిగినది. 





Monday, February 5, 2024

ఉద్యోగ్ ఆధార్ సర్టిఫికెట్ రిజిస్ట్రేషన్

04-02-2024 , 05-02-2024 రెండురోజులుగా తిరుపతి కార్పెంటర్స్ కమిటీ కార్పెంటర్స్ సోదరులకు లోన్స్ కొరకు అవసరమైన ఉద్యమ కార్డు రిజిస్ట్రేషన్ కమిటీ ప్రధాన కార్యదర్శి శ్రీ కుప్పచారి చొరవతో అధికమందికి చేయించడం జరిగినది. ఉద్యోగ్ ఆధార్ రిజిస్ట్రేషన్ అన్నది కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకం. ఏదైనా లోన్స్ కి అవసరమైన సర్టిఫికెట్ ఇది వృత్తిదారులు , పీఎం విశ్వకర్మ యోజన , పీఎం ఎంప్లొయ్ జనరేషన్ ప్రోగ్రాం లోన్స్ , యంత్రాల ద్వారా వస్తు ఉత్పత్తి చేయువారు ,కుటీర పరిశ్రమలు పెట్టుకున్నవారు , కొత్తగా మొదలు పెట్టాలనుకున్నవారు మొదట ఈ సర్టిఫికెట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. పై వాటిపై పూర్తి అవగాహనా కార్యక్రమం తిరుపతి జిల్లా లగిన్స్ పొందిన సంస్థ ద్వారా సర్టిఫికెట్స్ చేయించడం జరిగినది.