ది స్టేట్ కార్పెంటర్స్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్రీ అంబికాపతి గారి కృషి , పీలేరు మండల కార్పెంటర్స్ సభ్యుల సహకారం తో ఎన్నోరోజుల కల అయినా పీలేరు కార్పెంటర్స్ కాలనీ చదును కార్యక్రమం కొద్దిరోజుల విరామం తర్వాత మల్లి మొదలు అయింది. పీలేరు మండల్ కార్పెంటర్స్ అధ్యక్షుడు శ్రీ రెడ్డిబాబు , కోశాధికారి శ్రీ శంకరాచారి గార్ల కష్టానికి ప్రతిఫలం ఈ కార్పెంటర్స్ కాలనీ . కలసి ఉంటె కలదు సుఖం అనే నానుడిని నిజం చేస్తూ అసాధ్యం అన్నదాన్ని సుసాధ్యం చేస్తూ 6 ఎకరాల స్థలం నాయకులనుంచి సాధించుకోని ఇల్లు లేని కార్పెంటర్ కి 2 సెంట్ల స్థలం ఇవ్వాలని ఎన్నోరోజులు పనులు మానుకొని తిరిగి సాధించుకున్న పీలేరు కార్పెంటర్ సబ్యులకు అభినందనలు తెలియచేస్తూ మీరు ఇలాగె కలసి ఉంటూ పోరాటాలు చేస్తూ కావలసిన వాటిని సాధించుకుంటూ కార్పెంటర్స్ మనసులో ఓ సుస్థిర స్థానం సాధించుకోవాలని కోరుకుంటున్నాము
29/01/24 ఈరోజు కూడా ఉదయం నుంచి రాత్రికూడా విరామం లేకుండా యుద్ధప్రాతిపదికన జేసీబీ లతో నిర్విరామంగా పనులు చేస్తున్న తీరుకి నిజంగా పీలేరు మండల కార్పెంటర్స్ సభ్యులు అభినందనీయులు . కార్పెంటర్స్ కాలనీ కలను సాకారం చేసుకోవడానికి పడుతున్న కష్టం , వారి అంకిత భావం ,చిత్తశుద్ధి కి అబినందనలు
No comments:
Post a Comment