30/01/24 , 31/01/24 తేదీల్లో పీలేరు కార్పెంటర్ కాలనీ చదును కార్యక్రమం నిర్విఘ్నంగా కొనసాగుతూ చాలవరకు యుద్ధప్రాతిపధికన చేస్తున్నారు. పీలేరు కమిటీ కార్యవర్గం దాదాపు అక్కడే ఉంటూ అక్కడే భోజనం చేస్తూ ఉన్న తీరు వారి ఐక్యమత్యానికి నిదర్శనం. 30/01/24 తేదీ రాష్ట్ర అధికార ప్రతినిధి సురేంద్రబాబు(పాకాల) , రాష్ట్ర సంయుక్త కార్యదర్శి చంద్రశేఖర్ గారు(చిత్తూర్) , మజరాలి గారు స్థలానికి విచ్చేసి రాష్ట్ర ఉపాధ్యక్షుడు పట్నం అంబికాపతి గారిని , రెడ్డిబాబు గారిని , శంకర ఆచారి గారిని అభినందించడం జరిగినది. కొద్దిగా పనులకు అంతరాయం కలిగిన తర్వాత యధావిధిగా పనులు చేయడం జరిగినది.
ఈ బ్లాగ్ కార్పెంటర్ వృత్తికీ సంబంధించిన పోస్ట్లు మాత్రమే. ది స్టేట్ కార్పెంటర్స్ వర్కర్స్ యూనియన్ కి సంబంధించినది
Wednesday, January 31, 2024
పీలేరు కార్పెంటర్స్ కాలనీ
30/01/24 , 31/01/24 తేదీల్లో పీలేరు కార్పెంటర్ కాలనీ చదును కార్యక్రమం నిర్విఘ్నంగా కొనసాగుతూ చాలవరకు యుద్ధప్రాతిపధికన చేస్తున్నారు. పీలేరు కమిటీ కార్యవర్గం దాదాపు అక్కడే ఉంటూ అక్కడే భోజనం చేస్తూ ఉన్న తీరు వారి ఐక్యమత్యానికి నిదర్శనం. 30/01/24 తేదీ రాష్ట్ర అధికార ప్రతినిధి సురేంద్రబాబు(పాకాల) , రాష్ట్ర సంయుక్త కార్యదర్శి చంద్రశేఖర్ గారు(చిత్తూర్) , మజరాలి గారు స్థలానికి విచ్చేసి రాష్ట్ర ఉపాధ్యక్షుడు పట్నం అంబికాపతి గారిని , రెడ్డిబాబు గారిని , శంకర ఆచారి గారిని అభినందించడం జరిగినది. కొద్దిగా పనులకు అంతరాయం కలిగిన తర్వాత యధావిధిగా పనులు చేయడం జరిగినది.
Sunday, January 28, 2024
నెలవారీ మీటింగ్
కార్పెంటర్స్ కాలనీ పీలేరు
ది స్టేట్ కార్పెంటర్స్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్రీ అంబికాపతి గారి కృషి , పీలేరు మండల కార్పెంటర్స్ సభ్యుల సహకారం తో ఎన్నోరోజుల కల అయినా పీలేరు కార్పెంటర్స్ కాలనీ చదును కార్యక్రమం కొద్దిరోజుల విరామం తర్వాత మల్లి మొదలు అయింది. పీలేరు మండల్ కార్పెంటర్స్ అధ్యక్షుడు శ్రీ రెడ్డిబాబు , కోశాధికారి శ్రీ శంకరాచారి గార్ల కష్టానికి ప్రతిఫలం ఈ కార్పెంటర్స్ కాలనీ . కలసి ఉంటె కలదు సుఖం అనే నానుడిని నిజం చేస్తూ అసాధ్యం అన్నదాన్ని సుసాధ్యం చేస్తూ 6 ఎకరాల స్థలం నాయకులనుంచి సాధించుకోని ఇల్లు లేని కార్పెంటర్ కి 2 సెంట్ల స్థలం ఇవ్వాలని ఎన్నోరోజులు పనులు మానుకొని తిరిగి సాధించుకున్న పీలేరు కార్పెంటర్ సబ్యులకు అభినందనలు తెలియచేస్తూ మీరు ఇలాగె కలసి ఉంటూ పోరాటాలు చేస్తూ కావలసిన వాటిని సాధించుకుంటూ కార్పెంటర్స్ మనసులో ఓ సుస్థిర స్థానం సాధించుకోవాలని కోరుకుంటున్నాము
29/01/24 ఈరోజు కూడా ఉదయం నుంచి రాత్రికూడా విరామం లేకుండా యుద్ధప్రాతిపదికన జేసీబీ లతో నిర్విరామంగా పనులు చేస్తున్న తీరుకి నిజంగా పీలేరు మండల కార్పెంటర్స్ సభ్యులు అభినందనీయులు . కార్పెంటర్స్ కాలనీ కలను సాకారం చేసుకోవడానికి పడుతున్న కష్టం , వారి అంకిత భావం ,చిత్తశుద్ధి కి అబినందనలు
Friday, January 26, 2024
కార్పెంటర్స్ జెండా వందనం
ఈరోజు జనవరి 26 రిపబ్లిక్ డే మరియు ఉమ్మడి గుంటూరు జిల్లాకు చెందిన నగరం మండలం చెరుకుపల్లి కార్పెంటర్ యూనియన్ స్థాపించి నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా 4వ వార్షికోత్సవ కార్యక్రమం అలాగే ఒక ర్యాలీ కార్యక్రమం ఈరోజు జరిగినది అలాగే ఇప్పటిదాకా వేరే సంఘానికి అనుబంధంగా ఉన్నారు అయితే వారు ఇకనుంచి స్టేట్ కార్పెంటర్ వర్కర్స్ యూనియన్ కి అనుబంధంగా పనిచేయడానికి ఒక నిర్ణయం తీసుకున్నారు. ఈ కార్యక్రమంలోది స్టేట్ కార్పెంటర్స్ వర్కర్స్ యూనియన్ గౌరవ జనరల్ సెక్రెటరీ అయినాటువంటి పటాన్ నాయబ్ రసూల్ గారి ఆధ్వర్యంలో సంఘ గౌరవ అధ్యక్షులు మరియు రాష్ట్ర ఉపాధ్యక్షులు నల్లూరి రాజశేఖర్ మరియు నగరం మండల కార్పెంటర్ యూనియన్ అధ్యక్షులు సెనగపాటి సాంబశివరావు మరియు గుంటూరు జిల్లా అధ్యక్షులు అయినటువంటి గౌరీపట్నం సూర్యనారాయణ చెరుకుపల్లి ప్రెసిడెంట్ కారంకి రాజశేఖర్ సెక్రెటరీ బోర గడ్డ రమేష్ మరియు టింబర్ డిపో అధినేత రమణ గారు మరియు మధుగారు యూనియన్ సభ్యులు అందరూ మరియు మధుగారు యూనియన్ సభ్యులు అందరూ పాల్గొని కార్యక్రమం విజయవంతం చేయడం జరిగినది
Monday, January 22, 2024
సమాజసేవ
అయోధ్యలో శ్రీరాముడు విగ్రహ ప్రతిష్ట సందర్భంగా పీలేరులో పంచాయతీ ఆఫీస్ అంబేద్కర్ విగ్రహం దగ్గర పీలేరు కార్పెంటర్ యూనియన్ ఆధ్వర్యంలో మజ్జిగ పానకం పంపిణీ జరిగింది ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఉపాధ్యక్షులు అంబికాపతి ఆచారి, మండల అధ్యక్షుడు రెడ్డి బాబు గారు మండల కోశాధికారి సంకరాచారి గారు గౌరవ సలహాదారులు వేణుమాచారి గారు తిరుమల చారి గారు గౌరవ అధ్యక్షుడు బ్రహ్మచారి గారు చాన్ బాషా గారు కమిటీ సభ్యులు కృష్ణమ్మ ఆచారి వెంకటేష్ రమేష్ ఆచారి శివాచారి వెంకటేష్ ఆచారి గంగాధరం భాస్కరాచారి మునిరాజ్ ఆచారి కడప రామాంజనేయ ఆచారి గారు పాల్గొనడం జరిగింది
Thursday, January 18, 2024
ఆర్థిక సాయం
స్టేట్ కార్పెంటర్ వర్కర్స్ యూనియన్ రిజిస్టర్ నెంబరు 501
తుని పట్టణంలో కార్పెంటర్ శ్రీ సత్యనారాయణ గారు మరణించడం అందరికి తెలిసిన విషయమే. వారి ఆకస్మిక మరణం వారి కుటుంబ పరిస్థితి కి రాష్ట్రవ్యాప్త కార్పెంటర్స్ స్పందిస్తూ
స్టేట్ కార్పెంటర్ వర్కర్స్ యూనియన్
అధ్యక్షులు పప్పుసాని నాగేశ్వర్ రెడ్డి గారు 1500
ప్రధాన కార్యదర్శి పఠన్ నయబ్ రసుల్ గారు 1000
కోశాధికారి తామరపల్లి మోహన్ రావు గారు 1000
ఉపాధ్యక్షులు లక్కోజు సింహాచలం శివ గారు 1000
జి సూర్యనారాయణ గారు 1000.
రాష్ట్ర ఉపాధ్యక్షుడు అంబికా పతి గారు 1000
రాష్ట్ర నాయకులు శంకరాచారి గారు 1000
రాష్ట్ర గౌరవ అధ్యక్షుడుఅబ్దుల్ సలాం గారు 500
రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పి చంద్రశేఖర్ గారు 500
రాష్ట్ర గౌరవ అధ్యక్షులునబి రసూల్ గారు 500
తిప్పన వెంకటేశ్వరరావు చిన్ని గారు 500
లక్కోజు వెంకటేశ్వరరావు గారు 500
శనగపాటి సాంబశివరావు గారు 500
నల్లూరి రాజశేఖర్ గారు 500
అన్నమయ్య జిల్లా కన్వీనర్ రెడ్డిబాబు గారు 500
అన్నమయ్య జిల్లా కార్యదర్శి సయ్యద్ రెహమతుల్లా గారు 500
బట్టు వెంకటేశ్వరరావు గారు 500
అన్నమయ్య జిల్లా ఉపాధ్యక్షుడు ఖాసీం అలీ గారు 500
సురేంద్రబాబు గారు పాకాల 200
---------------------------
మొత్తం 13200రూ
యూనియన్ రాష్ట్ర ప్రధానకార్యదర్శి శ్రీ పఠాన్ నాయబ్ రసూల్ గారు , కోశాధికారి శ్రీ తామర పల్లె మోహనరావు గారు , ఉపాధ్యక్షుడు శ్రీ లాక్కోజు సింహాచలం గారి చేతుల మీదుగా ఆ కుటుంబ సభ్యులకు అందచేయడం జరిగినది. సాటి కార్పెంటర్ కష్టానికి స్పందించిన ప్రతిఒక్కరికి ధన్యవాదాలు
ఇట్లు
స్టేట్ కార్పెంటర్స్ వర్కర్స్ యూనియన్










